Sunday, 31 March 2013
Saturday, 30 March 2013
gunde jaari gallanthayyinde LATEST TRAILER
http://www.youtube.com/watch?feature=player_embedded&v=eFuq0GtDmc8LATEST TRAILER gunde jaari gallanthayyinde
హాట్ టాపిక్ : 'జస్టిస్ చౌదరి' గెటప్‌లో ఎన్టీఆర్
హైదారాబాద్ : తరాలు మారుతున్నా పెద్ద ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ తగ్గటం లేదని మరోసారి ‘బాద్‌షా' చిత్రం ప్రూవ్ చేయనుంది. ‘బాద్‌షా'లో జస్టిస్‌చౌదరి గెటప్‌లో కనిపించబోతున్నాడు. విశ్రాంతి తర్వాత వచ్చే ఈ ఎపిసోడ్‌లో ఐదు నిమిషాలపాటు తన అభిమా నుల్ని అలరించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మీడియావారు అడిగితే... నో కామెంట్స్ అని తప్పించుకున్నారు. మొదట్నుంచీ జూనియర్ ఎన్‌టిఆర్ సీనియర్‌ను అనుసరిస్తూ..అవసరమొచ్చినప్పుడు ఆ గెటప్ లతో అదరకొడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆది, సింహాద్రి సినిమాల్లో ఎన్‌టిఆర్ కృష్ణుని గెటప్పుల్ని వాడుకున్న జూనియర్ యమదొంగ చిత్రంలో అయతే సీనియర్‌ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించి, ఆయనతో డైలా గ్ చెప్పే సన్నివేశానే్న క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఇటీవల ఓ యాడ్‌లోనూ బడిపంతులు చిత్రం వేషంలోనూ కనిపించాడు. ఇక ‘దమ్ము' చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్ న టిస్తున్న చిత్రం ‘బాద్‌షా'. శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్.టి.ఆర్‌కు జోడీగా ఈ చిత్రంలో అందాల సుందరి కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బ్రహ్మా నందం, ఎమ్మెస్ నారాయణ, జయ ప్రకాష్‌రెడ్డిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయం టున్నారు. ‘బాద్‌షా' చిత్రానికి సంబంధించి ఆడియో ఇటీవల విడుదలై పాటలకు మంచి స్పందన లభించిందని, థమన్ శ్రోతలను అలరించే స్థాయిలో సంగీతాన్ని అందించారని ఆయన తెలిపారు. యుఎస్‌లో కూడా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్.టి.ఆర్ అభిమానులేకాక అక్కడి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఎన్.టి.ఆర్ లుక్స్, స్టయిల్, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్టయ్యే రేంజ్‌లో చిత్రం రూపొందిందని, యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్‌టైనర్ కలగలిపి ఈ బాద్‌షా ఉంటుందని, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
హాట్ టాపిక్: నాగార్జునతో పోటీ పడుతున్న నితిన్
నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం ‘గ్రీకు వీరుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో మార్చి 23న విడుదలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తేదీ మారినట్లు సమాచారం. మార్చి 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ ఫంక్షన్ ని ఘనంగా జరపాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే...ఈ చిత్రం మొదట అనుకున్నట్లు షెడ్యూల్ లో ఏ మర్పూ లేకుండా ఏప్రియల్ 19న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.
ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘చాలాకాలం తర్వాత నాగార్జున చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నాగ్, నయనతార కాంబినేషన్‌లో సాగే ప్రేమకథ అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. ఇందులో కొత్త నాగార్జునను చూస్తారు. మార్చిలో పాటలను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
నితిన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'గుండె జారి గల్లంతయ్యిందే' . బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. హాట్ సీజన్‌లో కూల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో గుత్తాజ్వాల పాట ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు యూనిట్ తెలిపింది. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై విక్రమ్‌గౌడ్ సమర్పణలో నిఖితారెడ్డి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వారంలో పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మనసొక మధుకలశం.. అన్నాడో సినీ కవి. అందుకే తీయని వూహల్లో తేలిపోతూ ఉంటుంది. ప్రేమ పేరెత్తితే ఇంకాస్త మధురంగా మారిపోతుంది. ఇష్టసఖి సమక్షంలో ఒకలా, లేనప్పుడు మరోలా స్పందిస్తుంది. అదే ప్రేమ మాయ. మా కథలో అబ్బాయికీ ఇదే జరిగింది. గుండె జారి గల్లంతయ్యింది. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు విజయ్ కుమార్ కొండా. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే'.
''స్వచ్ఛమైన ప్రేమభావనలకు ప్రతిరూపం ఈ కథ. ప్రేమలో పడినప్పుడు యువతీ యువకుల భావాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. నితిన్, నిత్యల జంట మరోసారి ఆకట్టుకొంటుంది. గుత్తా జ్వాలపై తీర్చిదిద్దిన ప్రత్యేక గీతం మరో ఆకర్షణ. వేసవిలో ప్రేక్షకులకు మా చిత్రం చక్కటి వినోదం ఇస్తుంది. ఈ వారంలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ఇషా తల్వార్ మరో హీరోయిన్. నిఖితారెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.సంగీతం: అనూప్ రూబెన్స్.